ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తులు

ఐటీఐలో అడ్మిషన్లకు దరఖాస్తులు

NLR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అందుబాటులో ఉన్న వివిధ ట్రేడ్లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెంకటేశ్వరపురం బాలికల ఐటీఐ ప్రిన్సిపల్ రిజియ తెలిపారు. విద్యార్థులు జూన్ 10లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్లు తదితర వివరాల కోసం సమీపంలోని ఐటీఐ కాలేజీలను సంప్రదించాలని పేర్కొన్నారు.