దేవరకద్రలో పోలీసుల కార్డెన్ సెర్చ్

MBNR: దేవరకద్ర మండల కేంద్రంలో మంగళవారం ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 36 బైకులు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, బూత్పూర్ సీఐ రామకృష్ణ, దేవరకద్ర ఎస్సై నాగన్నతో పాటు 10 మంది ఎస్సైలు, 40 మంది పోలీసులు పాల్గొన్నారు.