కాజీపేట రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తుపదార్థాల నియంత్రణ చర్యల్లో భాగంగా, సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలంతో కాజీపేట రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టింది. అనుమానిత వ్యక్తుల బ్యాగులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.