'వరంగల్ అంటేనే నారీ శక్తికి ప్రతీక'
వరంగల్ అంటేనే నారీ శక్తికి ప్రతీక అని, వరంగల్‌లో అన్ని కీలక పదవుల్లో మహిళలే ఉన్నారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని, తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరు మీదనే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.