మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్‌.. రోడ్డుపై వృథాగా పోతున్న నీరు

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్‌.. రోడ్డుపై వృథాగా పోతున్న నీరు

NZB: ఆలూర్ మండలంలోని మిర్దపల్లి రోడ్డులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజ్ ఏర్పడింది. అనేక రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన తాగునీరు వృథాగా పోతుంది. పైప్‌లైన్ లీక్ కారణంగా నీరు రోడ్డుమీద ప్రవహిస్తూ బురదమయంగా మారింది. దీంతో ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనాలు స్కిడ్ అవుతున్నాయి.