పెందుర్తిలో 9 బృందాలతో తనిఖీ

VSP: పెందుర్తి పరిధిలో రౌడీ షీటర్ల ఇళ్లను పోలీసులు మంగళవారం తనిఖీ చేశారు. 31 మంది సిబ్బందితో 9 బృందాలుగా ఏర్పడి ఏసీపీ పృథ్వీరాజ్ పర్యవేక్షణలో ఇన్‌ఛార్జ్ సీఐ కేశవరావు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రౌడీ షీటర్ల వద్ద నుంచి నేర ప్రవృత్తికి సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.