రాకాసితండా వంతెనను సందర్శించిన ఏసీపీ

KMM: తిరుమలయపాలెం మండలం రాకాసితండా వంతెనను బుధవారం ఏసీపీ తిరుపతి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వంతెనపై నుంచి ఆకేరు వద్ద ఉధృతిని MRO లూధర్ విల్సన్, MPDO సీలర్ సాహెబ్, ఎస్సై జగదీష్‌తో కలిసి పరిశీలించారు. వరద ఉధృతి పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. అటు పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.