తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్

సుండుపల్లె మండలంలో ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. రాయవరం పంచాయతీ చీనేవాండ్లపల్లెకు చెందిన కాటగాని రమేశ్‌బాబు ఈ నెల 27న బాల్రెడ్డిగారిపల్లెలోని కృష్ణయ్య ఇంటి తాళాలను పగులగొట్టే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారని ఎస్సై తెలిపారు.