ఎన్నికల ఆలస్యంతో నిధులు స్తంభన.. గ్రామాభివృద్ధి ఆగం
WGL: పాలకవర్గాలు లేని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయబోమని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రెండేళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. ఎస్‌ఎఫ్‌సీ నిధులు 2023 ఆగస్టు నుంచి, కేంద్ర నిధులు 2024 ఆగస్టు నుంచి ఆగిపోయాయి. ఉమ్మడి WGL జిల్లా 1708 గ్రామ పంచాయతీలకు రూ.70 కోట్లు ట్రెజరీలో నిలిచి, అభివృద్ధి పనులు జరగలేదు.