ఇరాన్‌లోUAE రాయబార కార్యాలయం మూసివేత
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు UAE ప్రకటించింది. అక్కడి నుంచి తమ రాయబారితో పాటు దౌత్యవేత్తలందరినీ తక్షణమే ఉపసంహరించుకుంది. ఇటీవల UAEపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం పశ్చిమాసియాలో దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తోంది.