ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇండిగో విమానాన్ని పేల్చివేస్తామని ఫోన్ ద్వారా బెదిరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.