VIDEO: కనిగిరిలో బీసీవైఎం పార్టీ పోటీ

VIDEO: కనిగిరిలో బీసీవైఎం పార్టీ పోటీ

ప్రకాశం: బీసీవైఎం అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ గురువారం కనిగిరిలో పర్యటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనిగిరి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో బీసీవైఎం పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కనిగిరి నియోజకవర్గంలో కచ్చితంగా పార్టీ గెలుపు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, ప్రజల ఆశీర్వాదంతో విజయాన్ని సాధిస్తామన్నారు.