నర్సింగాపూర్ విద్యార్థినికి నవోదయ సీటు
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బండపల్లి రియా అనే విద్యార్థిని నవోదయ ప్రవేశ పరీక్షలో సీటు సాధించింది. నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో రియా 5వ తరగతి చదువుతుంది. ఇవాళ ప్రకటించిన నవోదయ ఫలితాల్లో అర్హత సాధించింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సింగిరెడ్డి జలంధర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.