'రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం'
E.G: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. బుధవారం కోరుకొండ మండలం కోటి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.