'ఏనుగులతో రైతులు అప్రమత్తంగా ఉండాలి'
PPM: జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామ పరిసరాల్లో గల పొలాల్లో ఏనుగులు ఆదివారం సంచరిస్తుండడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్ళేటప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు.