VIDEO: హాస్టల్‌లో పరిశుభ్రత లోపాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
ప్రకాశం: కొమరోలులోని SC హాస్టల్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విశ్రాంతి గదులు, కిచెన్, బాత్రూంలు, మరుగుదొడ్లను నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి ఆయన వ్యక్తం చేశారు. సిబ్బంది అన్ని విధాల సౌకర్యాలపై దృష్టి పెట్టి విద్యార్థులకు సహకరించాలన్నారు.