దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
SRPT: ఆత్మకూరు (ఎస్)మండలంలోని దండు మైసమ్మ ఆలయంలో దుండగులు బరితెగించారు. గుడిలోని హుండీని ఎత్తుకెళ్లి, వెనుక ఉన్న పొలాల్లో పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ అపచారంపై భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.