'పల్లె దవాఖాన ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి'
HNK: పెండింగ్‌లో ఉన్న పల్లె దవాఖాన ఉద్యోగుల 2 నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్' పెద్దపెండ్యాల వైద్యాధికారి డా. పుట్ట మహేందర్ డిమాండ్ చేశారు. ఇవాళ పల్లె దవాఖాన ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి వారు నిరసనను తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు పస్తులు ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.