'కింగ్ కోహ్లీ' రికార్డ్‌ల వర్షం

'కింగ్ కోహ్లీ' రికార్డ్‌ల వర్షం

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లీ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ, సౌతాఫ్రికాపై ODIల్లో అత్యధికంగా 6 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. రాంచీ స్టేడియంలో అతడికి ఇది 5 ఇన్నింగ్స్‌ల్లో 3వ సెంచరీ. అలాగే, వన్డేల్లో సొంతగడ్డపై అత్యధికంగా 25 సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.