GLOBETROTTER: అభిమానుల బైక్ ర్యాలీ

GLOBETROTTER: అభిమానుల బైక్ ర్యాలీ

'SSMB 29' చిత్రానికి సంబంధించిన 'GLOBETROTTER' ఈవెంట్ కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులంతా 'SSMB 29' జెండాలతో బైక్ ర్యాలీగా ఈవెంట్‌కు తరలి వెళ్తున్నారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియా రోడ్లన్నీ సందడిగా మారాయి. కాగా, 18 ఏళ్లలోపు వారికి, సీనియర్ సిటిజన్స్‌కు అనుమతి లేదని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.