వరి పంట పొలంలో తిష్ట వేసిన ముంపు నీరు
కోనసీమ: కాట్రేనికోన గ్రామానికి చెందిన రైతు రంబాల స్వామి నాయుడు ఆరు ఎకరాల వరి పొలం భారీ వర్షాల వల్ల ముంపునకు గురైంది. నీరు దిగక పంట నష్టపోయింది. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. కోసిన పంట కూలీల ఖర్చులకే సరిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది ఏమిలేక పంటను ట్రాక్టర్‌తో దున్నేసాడు.