'చందనోత్సవం విజయవంతానికి సమన్వయం కీలకం'
విశాఖలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్‌ఓపీ ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసి, గత తప్పిదాలు పునరావృతం కారాదన్నారు.