ఆచంటలో ఇంటి స్థలం కోసం చిన్నారి వినతి

ఆచంటలో ఇంటి స్థలం కోసం చిన్నారి వినతి

W.G: జిల్లాలో సీపీఎం పాదయాత్ర 11వ రోజు ఆచంటలో ఉత్సాహంగా సాగింది. దారిపొడవునా ప్రజలు నాయకులకు వినతిపత్రాలు అందజేస్తూ సమస్యలు వివరించారు. ఈ క్రమంలో ఓ చిన్నారి నాయకులను కలిసి, తన తల్లి అనారోగ్యంతో ఉందని చెబుతూ సొంత ఇంటి స్థలం కోసం విన్నవించింది. ప్రభుత్వం స్పందించి తమకు ఇల్లు కేటాయించాలని కోరిన తీరు అక్కడి వారిని కదిలించింది.