'అన్న క్యాంటీన్లను మరింత అభివృద్ధి చేయాలి'
GNTR: తెనాలి మున్సిపల్ కార్యాలయంలో అన్న క్యాంటీన్ కమిటీ సభ్యులు, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్ల సీఈవో వంశీధర్ పాల్గొని క్యాంటీన్ల నిర్వహణ మరింత మెరుగు పరచాలన్నారు. అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామ అప్పలనాయుడు, ఎంఈ శ్రీకాంత్, అన్న క్యాంటీన్ కమిటీ సభ్యులు అన్నం పిన్నారావు, జి.మానసరెడ్డి, దివి అనిత, పలువురు అధికారులు ఉన్నారు.