నేడు జిల్లాలో జాబ్ మేళా
KMR: జిల్లా నిరుద్యోగుల కోసం ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇవాళ కలెక్టరేట్ ప్రాంగణంలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ చెప్పారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్ ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. వివరాలకు 6300057052 సంప్రదించాలన్నారు.