'రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలి'
MNCL: జిల్లాలోని రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో యాసంగి సీజన్ సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో సుమారు 1. 43 లక్షల ఎకరాలలో పంటలు సాగు జరిగే అవకాశం ఉందని, అధికారులు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.