జాతికుంట చెరువు సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాతికుంట చెరువు సుందరీకరణ పనులకు MLA గడ్డం వినోద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. రూ.1 కోటి 56 లక్షల వ్యయంతో చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన తరువాత ఈ ప్రాంతం మరింత అందంగా మారడంతో పాటు ప్రజలకు విశ్రాంతి కోసం మంచి ప్రదేశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.