కొత్త కేంద్రపాలిత ప్రాంతంపై కేంద్రం క్లారిటీ

కొత్త కేంద్రపాలిత ప్రాంతంపై కేంద్రం క్లారిటీ

పశ్చిమ బెంగాల్ సిలిగుడి కారిడర్ సమీపంలో కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర యోచిస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, అవన్నీ తప్పుడు వాదనలేనని కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు ‘పీఐబీ’ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ‘X’ వేదికగా ఓ పోస్టు చేసింది. అలాంటి ప్రతిపాదనలేవీ కేంద్రం పరిశీలనలో లేవని స్పష్టం చేసింది.