ఆ స్కూల్‌లో అందరూ పాస్
సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన SSC ఫలితాల్లో గాండ్లపెంట మండలం కటారుపల్లి కేజీబీవీ విద్యార్థిని గౌరీ రేఖ 562 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. ఈ పాఠశాలలో 37 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 37 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దుర్గ తెలిపారు.