VIDEO: 'మైనార్టీ ఇంటర్నేషనల్ స్కూల్ మంజూరు'
నెల్లూరులో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నెల్లూరుకు ఇంటర్నేషనల్ స్కూల్ మంజూరు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు మరోసారి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.