అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్‌ను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.