VIDEO: వాగులో చిక్కిన విద్యార్థులు.. గ్రామస్తులు సాయం

KMR: సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామ శివారులో రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో పదిమంది విద్యార్థులు చిక్కుకున్నారు. గ్రామస్తులు విద్యార్థులను ట్రాక్టర్‌తో వాగు దాటించారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అమర్ల బండ కన్ కల్ గ్రామానికి బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.