కార్యదర్శులను సస్పెండ్ చేసిన కలెక్టర్

WNP: జిల్లాలో విధులకు గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. హాజరు యాప్‌లో పాత ఫొటోలను అప్లోడ్ చేసిన రేకులపల్లి తండా, ఏదుట్ల, శాఖాపురంతండా, కొత్తనూగురు, గోపాల్ పేట, నందిమళ్ల పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు జారీ చేశారు.