గల్లీలలో డైవర్షన్ బోర్డులు పెట్టండి..!

HYD: నగరంలో గల్లీ గల్లీకి గణనాథుడిని ఏర్పాటు చేశారు. పలుచోట్ల ప్రధాన రహదారుల్లో మండపాలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు రోడ్డు మధ్య వరకు వచ్చి వెనుతిరగాల్సిన పరిస్థితి. గూగుల్ మ్యాప్ సైతం గుర్తించడం లేదని అంటున్నారు. దీనిపై మండపాలు ఏర్పాటు చేసిన వారు కాలనీ ఎంట్రన్స్, ఎగ్జిట్ ద్వారాల వద్ద డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసులు సూచించారు.