నగరంలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్

HYD: గ్రేటర్ HYD నగరంలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా GHMC అధికారులు తెలియజేశారు. 2025 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటికీ 9,899 గుంతలు పూడ్చి వేసినట్లుగా తెలియజేశారు. ప్రతి వార్డులో ఏరియాల ప్రకారంగా ప్రత్యేక బృందాలు రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేపడుతున్నట్లుగా అధికారులు వివరించారు.