అగ్ని ప్రమాదంలో తాటాకు ఇళ్ళు దగ్ధం

E.G: నిడదవోలు మండలం జీడిగుంటలో ఇవాళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వి. సూరిబాబుకు చెందిన తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ప్రమాదం కారణంగా రూ. 2 లక్షల నగదు, మూడు కాసుల బంగారంతో పాటు ఇంట్లో సామాగ్రి దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు.