బీజేపీ దేశంలో సెక్యులర్ భావాలను దెబ్బతీస్తుంది : సీపీఐ

వనపర్తి: బీజేపీ మూడవసారి అధికారం చేపట్టాక దేశంలో సెక్యులర్ భావాలు దెబ్బతింటున్నాయని సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి విజయరాములు ఆరోపించారు. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో పట్టణ సీపీఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అబ్రహం భాస్కర్ రవీందర్ శ్యాంసుందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.