ఐదుగురు జూదరులు అరెస్ట్
SKLM: కొత్తూరు మండలం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మాకవరం సమీపంలో కచ్చితంగా సమాచారం మేరకు పోలీసులు జూద శిబిరంపై శుక్ర వారం దాడి చేశారు. ఈ దారిలో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి రూ.15,540 స్వాధీనం చేసుకున్నామని ఎస్సై కె.వెంకటేశ్ చెప్పారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.