రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

SKLM: ఆముదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామంలో శ్రీ రామాలయం నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రామాలయ నిర్మాణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించడంతో దేవాదయ శాఖ ద్వారా రూ.32 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు.