పుట్టపర్తిలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

అనంతపురం: పుట్టపర్తిలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా వారం రోజులపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి నాగరాజు నాయక్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు.