ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దత్తత తీసుకున్న బిడ్డ వయసు మూడు నెలల కంటే తక్కువ ఉంటేనే ప్రసూతి సెలవులకు అర్హత అనేది సరికాదని తెలిపింది. దీనికి అనుమతించే సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020లోని సెక్షన్ 60(4) రాజ్యాంగ విరుద్ధమని చెెప్పింది. చిన్నారి వయసుతో సంబంధం లేకుండా దత్తత తీసుకున్న సమయం నుంచి 12 వారాల పాటు సెలవులు తీసుకునేందుకు అర్హత ఉంటుందని పేర్కొంది.