అధికారులకు నంద్యాల కలెక్టర్ కీలక ఆదేశాలు

NDL: గణేష్ ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను, గణేష్ కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మట్టి విగ్రహాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.