BREAKING: ఆగిన స్మృతి మంధాన పెళ్లి
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఆమె తండ్రి గుండెపోటుకు గురవడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇవాళ జరగాల్సిన వివాహం తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే వివాహం ఎప్పుడు ఉంటుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.