గ్రామ పంచాయతీ ఎన్నికలకు గుర్తులు కేటాయింపు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు గుర్తులు కేటాయింపు

MNCL: మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులు కేటాయించారు. అలాగే బ్యాలెట్ పత్రాల చివరన నోటా కూడా ఉండనుంది. సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రం తెలుపు రంగులో ఉంటుంది.