'బేటీ బచావో-బేటీ పడావో' పథకంపై అవగాహన సదస్సు

'బేటీ బచావో-బేటీ పడావో' పథకంపై అవగాహన సదస్సు

RR: షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ బాలికల హైస్కూల్లో "బేటీ బచావో-బేటీ పడావో" అనే పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈవో మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలికల హక్కులు, రక్షణ, ఉన్నత విద్య ప్రాముఖ్యతపై వివరించారు. బాలికల భద్రత, విద్య సాధికారతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.