మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

KMM: కాంగ్రెస్ పాలనలో రఘునాథపాలెం మండలానికి మహర్దశ పట్టనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈర్లపూడికి చెందిన 85 కుటుంబాలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.