పీర్ల చావిడిలో ప్రత్యేక ప్రార్థనలు

CTR: పుంగనూరులో మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా సుబేదారు వీధిలో కొలువు తీర్చిన పీర్ల చావిడిలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు, దువ్వా చేపట్టారు. తర్వాత హసేన్ - హుస్సేన్‌లను ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేటి రాత్రికి అగ్నిగుండ ప్రవేశం, ఆదివారం ఉదయం పీర్ల ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.