రైజ్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని రైజ్ సెంటర్‌ను కలెక్టర్ లక్ష్మీశా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహిళలకు హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు తయారీ, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబులై కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.