మినీ జాతరలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
భూపాలపల్లి: జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.