VIDEO: తృటిలో తప్పిన పెను ప్రమాదం
కృష్ణా: గుడివాడ సువర్ణ ఫ్యాన్స్ సమీపంలో శుక్రవారం ఒక్కసారిగా విద్యుత్ పోల్‌కు మంటలు అంటుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, విద్యుత్ సరఫరాను నిలిపి మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.